News19th Dec 03:04 PMSunil Byrisetty1 min read
రాజమహేంద్రవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటన
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో వివిధ విభాగాలకు సంబంధించి నూతనంగా నిర్మించిన పలు భవనాలను లాం
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో వివిధ విభాగాలకు సంబంధించి నూతనంగా నిర్మించిన పలు భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మెయిన్ గేట్ వద్ద కాలేజీ లోగోను ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ బ్లాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హై-గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ సైన్స్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించారు. అనంతరం ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ ను ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాల్ ఆఫ్ ఫేమ్ లో సంతకం చేశారు. అనంతరం కాలేజీలో వందేమాతరం మూవ్ వెంట్ మెమోరియల్ ను మంత్రి ఆవిష్కరించారు. వందేమాతరం ఉద్యమానికి ప్రతీకగా సైన్స్ బ్లాక్ వద్ద వందేమాతరం పార్క్ ను ప్రారంభించారు.