News20th Oct 10:02 AMSunil Byrisetty1 min read
యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ను సందర్శించిన మంత్రి లోకేష్
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ (UNSW) ను సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం ప
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ (UNSW) ను సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. అధునాతన బోధనా పద్ధతులు, టీచర్ ట్రైనింగ్, రెన్యూవబుల్ ఎనర్జీపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో మంత్రి లోకేష్ చర్చించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు , స్టూడెంట్ ఎక్స్చేంజి పథకాలను ప్రారంభించండి. ముఖ్యంగా STEM, కృత్రిమ మేధస్సు (AI), రెన్యూవబుల్ రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ యువతకు అధునాతన టెక్నాలజీలలో శిక్షణ ఇచ్చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థిరమైన వ్యవసాయం, నీటి నిర్వహణ అంశాల్లో ఏపీ వర్సిటీలతో కలసి సంయుక్త పరిశోధనలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సమర్థవంతమైన, డేటా ఆధారిత పరిపాలన, పబ్లిక్ పాలసీలపై యుఎన్‌ఎస్‌డబ్ల్యూ నైపుణ్యాన్ని ఏపీ ప్రభుత్వంతో కలిసి పంచుకోవాలని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ (UNSW) ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు.