News12th Oct 05:00 PMSunil Byrisetty1 min read
విశాఖ క్రికెట్ స్టేడియంలో మంత్రి లోకేష్ సందడి
విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరుతో ‘
విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరుతో ‘ఏ-గ్యాలరీ స్టాండ్’తో పాటు మరో క్రికెటర్ రావి కల్పన పేరుతో ‘మూడో నెంబర్ గేట్’ ను ఐసీసీ ఛైర్మన్ జై షా తో కలిసి మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షులు మిథున్ మన్హాస్, ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ పాల్గొన్నారు. అనంతరం భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ ను మ్యాచ్ ను జై షాతో కలిసి మంత్రి నారా లోకేష్ వీక్షించారు. లోకేష్ రాకతో స్టేడియం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు చేరుకున్నారు.