News29th Jul 10:31 AMSunil Byrisetty1 min read

నెల్లూరు ట్రెండ్.. సొంత డబ్బుతో నారాయణ పంచేశారు!

నారాయణ విద్యాసంస్థల అధినేత, మంత్రి నారాయణ తన ఉదారతను చాటుకున్నారు. సంపాదించడంతోపాటు కొంత దాతృత్వానికీ వెచ్చిస్తున్నారు. అదే తరహాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, దర్శి ఇ

నెల్లూరు ట్రెండ్.. సొంత డబ్బుతో నారాయణ పంచేశారు!
నారాయణ విద్యాసంస్థల అధినేత, మంత్రి నారాయణ తన ఉదారతను చాటుకున్నారు. సంపాదించడంతోపాటు కొంత దాతృత్వానికీ వెచ్చిస్తున్నారు. అదే తరహాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, దర్శి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి, ఎమ్మెల్యే సురేంద్ర బాబు విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేస్తున్నారు. నారాయణ చేసిన సైకిళ్ల పంపిణీ టీడీపీలో ఇప్పుడొక ట్రెండ్ గా మారింది. తాజాగా మంత్రి నారాయణ తన సొంత డబ్బుతో ‘నారాయణ విద్యావాహనం’ అనే పేరుతో సుమారు 16 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7,000 సైకిళ్లు పంపిణీ చేశారు. నెల్లూరును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దే క్రమంలో MP వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్న అజీజ్ అందరూ పూనుకొని నెల్లూరు పరిధిలోని 16–20 ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేశారు. ప్రభుత్వ పాఠశాలలను మార్చాలంటే ప్రభుత్వం ఒక్కటే కాదు... సంకల్పం ఉన్న ప్రజాప్రతినిధులు, దాతలు కూడా ముందుకు వస్తే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలరో నెల్లూరు నిరూపించింది. మిగతా పార్లమెంటు సభ్యులు కూడా నెల్లూరు నాయకులు చేసింది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తే రాష్ట విద్యారంగంలో అద్భుతాలు చూడొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra Pradesh
Nellore
Narayana
Ponguru Narayana
Government Schools
Bicycle Distribution
Student Welfare
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
గొట్టిపాటి రవికుమార్
దాతృత్వం
Scroll for the next article