News14th Jul 12:23 PMSunil Byrisetty1 min read

సింగపూర్ ప్రభుత్వంతో మంత్రి నారాయణ సమావేశం

మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తయింది. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరె

సింగపూర్ ప్రభుత్వంతో మంత్రి నారాయణ సమావేశం
మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తయింది. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్,సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం,శిక్షణతో పాటు సలహాలు, సూచనలు అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సింగపూర్ ప్రతినిధులు వెల్లడించారు.
Andhra Pradesh
Narayana
Amaravati
Singapore
AP Government
Urban Development
Capital City
Infrastructure
పట్టణాభివృద్ధి
సింగపూర్ ప్రభుత్వం
పెట్టుబడులు
అంతర్జాతీయ సహకారం
అమరావతి అభివృద్ధి
Scroll for the next article