News4th Nov 05:30 PMSunil Byrisetty1 min read

దుబాయ్ లో మంత్రి నారాయణ వరుస భేటీలు

దుబాయ్ లో మంత్రి నారాయణ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నేడు ఉదయం *అపరెల్(apparel) గ్రూప్ చైర్మన్ నీలేష్ వేద్ తో మంత్రి భేటీ అయ్యారు. ఫ్యాషన్,ఫుట్ వేర్ రంగాల్లో 14 దేశాల్లో ప్రసిద్

దుబాయ్ లో మంత్రి నారాయణ వరుస భేటీలు
దుబాయ్ లో మంత్రి నారాయణ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నేడు ఉదయం *అపరెల్(apparel) గ్రూప్ చైర్మన్ నీలేష్ వేద్ తో మంత్రి భేటీ అయ్యారు. ఫ్యాషన్,ఫుట్ వేర్ రంగాల్లో 14 దేశాల్లో ప్రసిద్ధి పొందిన అపరెల్ గ్రూప్ ను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ రామకృష్ణన్ తో భేటీ అయ్యారు. షిప్పింగ్,లాజిస్టిక్స్ రంగంలో దుబాయ్ కేంద్రంగా అనేక దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ తో భేటీలో రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగం అభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. ఏపీని లాజిస్టిక్ హబ్ గా మార్చేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని ఆయా కంపెనీలకు మంత్రి నారాయణ ఆహ్వానం పలికారు.
Minister Narayana
Dubai Visit
Apparel Group
Transworld Group
Investments in Andhra Pradesh
Logistics Development
Shipping Industry
లాజిస్టిక్స్ అభివృద్ధి
షిప్పింగ్ రంగం
ఫ్యాషన్ పరిశ్రమ
విశాఖ భాగస్వామ్య సదస్సు
Scroll for the next article