News19th Aug 03:46 PMSunil Byrisetty1 min read

కొండవీటి వాగు ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ

కొండవీటి వాగు ప్రవావాహానికి ఆటంకం వల్ల నీరు నిలిచిపోయిన నీరుకొండ పరిసర ప్రాంతాలను మంత్రి నారాయణ పరిశీలించారు. పశ్చిమ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆ

కొండవీటి వాగు ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ
కొండవీటి వాగు ప్రవావాహానికి ఆటంకం వల్ల నీరు నిలిచిపోయిన నీరుకొండ పరిసర ప్రాంతాలను మంత్రి నారాయణ పరిశీలించారు. పశ్చిమ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మట్టిని అడ్డు వేసి వదిలేయడంతో వాగు ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తాయి. అడ్డుగా ఉన్న మట్టిని తొలగించడంతో పాటు వెస్ట్ బైపాస్ రోడ్డుకు రెండు చోట్ల గండ్లు కొట్టి నీరు వెళ్లేలా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ అమరావతిపై మీ ఏడుపులు ఇకనైనా ఆపాలన్నారు. లేదంటే మీకు ఆ 11 సీట్లు కూడా ఇవ్వరన్నారు. నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా అని, గుంతల్లోకి నీరు వస్తె ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా అని ప్రశ్నించారు. రాజధాని మునిగిపోతుందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూడాలన్నారు. కారణాలు తెలియకుండా వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు.
Andhra Pradesh
Minister Narayana
Kondaveeti Vagu
Amaravati
Flood Management
Infrastructure
Water Flow
కొండవీటి వాగు ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ
Scroll for the next article