News17th Aug 11:46 AMSunil Byrisetty1 min read

రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు(సోమవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల ప

రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు(సోమవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పనులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రపోజ్ చేయగా, 103 పనులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇవ్వగా ప్రస్తుతం 97 పనులు జరుగుతున్నాయని చెప్పారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డుల ద్వారా రూ.41,187.7 కోట్లను టూ అప్ చేశామని.. ఇందులో రూ.12,737.13 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అలాగే, ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఇచ్చామని, ఇప్పటి వరకూ 30173 మంది రైతులకు 71,293 ప్లాట్‌లు ఇచ్చామన్నారు. కౌలు కింద రూ. 2248.03 కోట్ల మేరకు రైతులకు చెల్లించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Andhra Pradesh
Amaravati
Capital Development
Minister Narayana
Capital Construction
Amaravati Development
Land Pooling
రైతులు
రిటర్నబుల్ ప్లాట్లు
వరల్డ్ బ్యాంక్
ఏడీబీ
నాబార్డ్
మౌలిక వసతులు
Scroll for the next article