Politics8th Mar 04:09 PMSunil Byrisetty1 min read
స్కూటీ నడిపిన మంత్రి నారాయణ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లాలో 26 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్కూటీలను అందజేశారు. మెప్మాలోని స్వయం సహాయక సంఘాల ద్వారా మ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లాలో 26 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్కూటీలను అందజేశారు.
మెప్మాలోని స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు స్కూటీలు అందించారు.
మహిళల స్వయం ఉపాధికి ఈ స్కూటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
అంతకు ముందు స్కూటీలను పరిశీలించి, పనితీరును అడిగి తెలుసుకున్నారు.
అలాగే మంత్రి నారాయణ స్వయంగా స్కూటీ నడిపారు.
అనంతరం మహిళ నడిపిన రాపిడో స్కూటీ వెనక కూర్చున్న నారాయణ డ్రైవింగ్ ను పరిశీలించారు.
ఈ ప్రభుత్వం మహిళాపక్షపాతి అని వివరించారు.