Politics13th Sep 03:57 PMSunil Byrisetty1 min read
రాజధాని విషయంలో వైసీపీ మాట మార్చింది
వైసీపీ నేతల రాజధాని వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు. నాయకుడికి స్థిరత్వం అవసరమని, అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులంటూ చెప్పి, అధికారం కోల్పోయాక మాట మార్చడం సరికాదని అన్నారు.
వైసీపీ నేతల రాజధాని వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు. నాయకుడికి స్థిరత్వం అవసరమని, అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులంటూ చెప్పి, అధికారం కోల్పోయాక మాట మార్చడం సరికాదని అన్నారు. 2014లో కూడా అమరావతి రాజధానికి వైసీపీ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. సజ్జల చెప్పిందంటే జగన్ చెప్పినట్లే కదా, గతంలో అందరి తరఫున ఆయన స్పందించారని నారాయణ వ్యాఖ్యానించారు. “నేను మంత్రిగా మాట్లాడితే సీఎం చంద్రబాబు చెప్పినట్లే కదా. అయితే రాజధానిపై గతంలో అసెంబ్లీలో చెప్పిన మాటలను ఇప్పుడు మార్చడం ఏమిటి?” అని మంత్రి నారాయణ ప్రశ్నించారు.