News1st Aug 06:28 PMSunil Byrisetty1 min read
సింగపూర్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించేలా అవసరమైన పద్దతులపై అధ్యయనం చేస్తున్నారు మంత్రి నారాయణ. గత ఆరు రోజులుగా సింగపూర్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ..
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించేలా అవసరమైన పద్దతులపై అధ్యయనం చేస్తున్నారు మంత్రి నారాయణ. గత ఆరు రోజులుగా సింగపూర్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ.. వివిధ నిర్మాణాలు,ప్రాజెక్ట్ లను అధ్యయనం చేయడంతో పాటు పలువురు ప్రముఖులతో సమావేశమవుతున్నారు. సింగపూర్ లోని ALBA వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ ప్లాంట్ లో ఘన వ్యర్ధాలను వివిధ రూపాలుగా మార్చనున్నారు. ఇళ్లు,పరిశ్రమల నుంచి సేకరించిన ఘన వ్యర్ధాలను అధునాతన టెక్నాలజీతో తయారుచేసిన వాహనాల్లో ఈ ప్లాంట్ కు తరలిస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ రీసైక్లింగ్ తో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను రీ సైక్లింగ్ చేయనున్నారు. మిగిలిన ఘన వ్యర్ధాలను వేస్ట్ టు ఎనర్జీగా మారుస్తున్నారు. వ్యర్ధాల సేకరణ నుంచి వాటిని రీసైక్లింగ్ చేసే వరకూ ఎలాంటి పద్దతులు అవలంబిస్తున్నారనేది సింగపూర్ అధికారులు మంత్రి నారాయణకు వివరించారు. సింగపూర్ లో అనుసరిస్తున్న విధానాలను ఏపీలో కొన్నిచోట్ల అమలుచేస్తే ఎలా ఉంటుందనే దానిపై మంత్రి నారాయణ చర్చించారు.