News21st Dec 04:19 PMSunil Byrisetty1 min read

కోనసీమ జిల్లాలో మంత్రి నారాయణ

కోనసీమ జిల్లా మండపేటలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వర రావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 960 టిడ్క

కోనసీమ జిల్లాలో మంత్రి నారాయణ
కోనసీమ జిల్లా మండపేటలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వర రావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 960 టిడ్కో ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. మండపేటలో నిర్మాణం పూర్తయిన రోడ్లు, డ్రెయిన్లు, స్ట్రీట్ లైట్ల ప్రారంభం, పార్కుల అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రూ.5.95 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. 2014-19లో పేదల కోసం హై క్వాలిటీ ఇళ్లు కట్టాలని సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించారని, షేర్ వాల్ టెక్నాలజీతో పేదలకు ఇళ్లు కట్టింది ఏపీ మాత్రమేనని వివరించారు.
Andhra Pradesh Politics
Konaseema District
Minister Narayana
Mandapeta
TDP Government
Development Works
TIDCO Houses
పట్టణాభివృద్ధి శాఖ
ఏపీ ప్రభుత్వం
మున్సిపాలిటీ అభివృద్ధి
Scroll for the next article