News3rd Nov 03:26 PMSunil Byrisetty1 min read
దుబాయిలో మంత్రి నారాయణ బృందం పర్యటన
దుబాయిలో మొదటి రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. దుబాయిలో ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులు B.G. కృష్ణన్,సెలీనా శశికాంత్ తో భేటీ అయ్యారు. దుబాయి పర్యటన, ఏపీ అభివృద్ధిపై కాన్
దుబాయిలో మొదటి రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. దుబాయిలో ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులు B.G. కృష్ణన్,సెలీనా శశికాంత్ తో భేటీ అయ్యారు. దుబాయి పర్యటన, ఏపీ అభివృద్ధిపై కాన్సుల్ ప్రతినిధులకు వివరించారు. శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తాతో మంత్రి భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్,ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో శోభా గ్రూప్ ప్రపంచ ప్రసిద్ధి పొందారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు శోభా గ్రూప్ ఆసక్తి కనబరిచింది. అలాగే దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ తో లంచ్ మీటింగ్ లో మంత్రి నారాయణ పాల్గొన్నారు.