News1st May 05:59 PMSunil Byrisetty1 min read
పెద్ద కూలీని నేనే.. రిక్షా తొక్కిన మంత్రి
జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఒక్కసారిగా రిక్షా కార్మికునిగా మారిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వందలాది మంది రిక్షా కార్మికులతో కలిసి రిక్షా తొక్కారు. అది
జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఒక్కసారిగా రిక్షా కార్మికునిగా మారిపోయారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వందలాది మంది రిక్షా కార్మికులతో కలిసి రిక్షా తొక్కారు.
అది కూడా మండుటెండలో నాలుగు కిలోమీటర్లు ఎటువంటి అలసట లేకుండా తొక్కారు.
మేడే సందర్భంగా గురువారం రిక్షా కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో పాల్గొన్న కార్మికులందరికీ టీ షర్ట్లు, రెండు టవల్స్ ను ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి రామానాయుడు అందజేశారు.
అందరికీ పలావ్ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ పాలకొల్లు పెద్దకూలి నేనే అన్నారు.
గత 15 సంవత్సరాలుగా మేడే రోజున కార్మికులతో కలిసి వేడుకల్లో పాల్గొనడం సంతృప్తి ఆనందాన్ని ఇస్తుందన్నారు.