Politics30th Sep 05:34 PMSunil Byrisetty1 min read

జగన్ ముందు మాఫియా డాన్లు సైతం దిగదుడుపే!

బాబాయ్ హత్యతో అబ్బాయి మాత్రమే లాభం పొందాడని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి, నేరపూరిత మనస్తత్వం ముందు అంతర్జాతీయ మాఫియా డాన్లు సైతం దిగదుడుపేనని, తా

జగన్ ముందు మాఫియా డాన్లు సైతం దిగదుడుపే!
బాబాయ్ హత్యతో అబ్బాయి మాత్రమే లాభం పొందాడని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి, నేరపూరిత మనస్తత్వం ముందు అంతర్జాతీయ మాఫియా డాన్లు సైతం దిగదుడుపేనని, తాను చేసిన ఘోర నేరాలు, హత్యలను ఇతరులపైకి నెట్టేసి తప్పించుకోవడంలో జగన్ నేర సామ్రాజ్యానికే సరికొత్త పాఠాలు నేర్పుతున్నారని మండిపడ్డారు. కేవలం ఆర్థిక ఉగ్రవాదిగానే కాకుండా నేరాల సూత్రధారిగా అవతరించిన జగన్, తాత రాజారెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రంలో తన అనుచరులకు ‘రప్పా రప్పా’ హింసా సంస్కృతిని నూరిపోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ స్వయంగా వాస్తవాలు వెల్లడిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని మంత్రి నిలదీశారు. వివేకా హత్యతో అంతిమ లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అవినాష్ రెడ్డి మాత్రమేనని సునీల్ యాదవ్ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ప్రజలకు జగన్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
Scroll for the next article