Politics13th Oct 04:28 PMSunil Byrisetty1 min read
లిక్కర్ మాఫియా వెనుక జగన్!
ఏపీలో లిక్కర్ మాఫియాను జగనే పెంచి పోషించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని, మాఫియాను అరికట్టేందుకు సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటున్నారన
ఏపీలో లిక్కర్ మాఫియాను జగనే పెంచి పోషించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని, మాఫియాను అరికట్టేందుకు సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఏడాదిలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, అమరావతి, పోలవరం వేగవంతం చేస్తామన్నారు.
అభివృద్ధి, సంక్షేమాలు రెండు కళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో, ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలోనే గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని మించి కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని అందించిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు వస్తున్నామని వివరించారు.