News18th Jun 11:01 AMSunil Byrisetty1 min read
తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల రగడ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టుపైన రగడ జరుగుతోంది. దీనిపై తాజాగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వాస్తవా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టుపైన రగడ జరుగుతోంది. దీనిపై తాజాగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 50 సంవత్సరాలుగా గోదావరి నీరు వృధాగా 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుందనన్నారు. అలా వృధాపోయే గోదావరి నీటిలో 200టీఎంసీల నీటిని బనకచర్ల కు తరలించాలని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు, బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు, బొల్లాపల్లి నుంచి బనకచర్ల వరకు మూడు సెగ్మెంట్లుగా బనకచర్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. బనకచర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాల కోసమేనని, తెలంగాణ రాష్ట్రంలో అంతర్గత రాజకీయాల కోసం చేస్తున్న ఆరోపణలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.