News17th Sep 05:39 PMSunil Byrisetty1 min read

పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల

పోలవరం ప్రాజెక్ట్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసిఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతి ని అడిగి తెలుసుకున్నారు. ఈసిఆర్ఎఫ్ డ్యామ్

పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్ట్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసిఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతి ని అడిగి తెలుసుకున్నారు. ఈసిఆర్ఎఫ్ డ్యామ్ కు సంబందించి గ్యాప్-1 నిర్మాణ పనులు 49 శాతం, గ్యాప్-2 పనులు 43 శాతం పూర్తి చేశామన్నారు. రైట్ కనెక్టివిటీస్ పనులు ఈ నెలాఖరు నాటికి, లెఫ్ట్ కనెక్టివిటీస్ పనులు నవంబర్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు. ఈసిఆర్ఎఫ్ డ్యామ్ పనులు 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యం పెట్టారని చెప్పారు. రూ.536 కోట్లతో చేపట్టిన కుడి,ఎడమ గట్ల అనుసంధాన పనులు జరుగుతున్నాయన్నారు. 2024 జూన్ తరువాత 10,491 ఎకరాల భూసేకరణ చేసి, నిర్వాసితులకు 2,250 కోట్ల పరిహారాన్ని అందించామని వివరించారు.
Andhra Pradesh
Polavaram Project
Polavaram Dam
Nimmala Ramanaidu Minister
పోలవరం సాగునీటి ప్రాజెక్ట్
సాగునీటి ప్రాజెక్టులు
చంద్రబాబు నాయుడు
ఏపీ ఇరిగేషన్
Scroll for the next article