Politics9th Jun 05:42 PMSunil Byrisetty1 min read

రైతులను, మహిళలను కించపరచడం దారుణం

ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పరిరక్షించడంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ముసుగులో సాక్షి ఛానల్, పత్రిక ప్రతినిత్యం ప్రభుత్వంపై విషం కక్కుతోందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ద

రైతులను, మహిళలను కించపరచడం దారుణం
ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పరిరక్షించడంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ముసుగులో సాక్షి ఛానల్, పత్రిక ప్రతినిత్యం ప్రభుత్వంపై విషం కక్కుతోందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. సాక్షి మీడియా అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ అభివర్ణించటం అత్యంత హేయమైన చర్యగా రామానాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ చర్య అమరావతి రాజధాని మహిళా రైతులను మాత్రమే కాకుండా యావత్తు మహిళా లోకాన్ని కించపరచడమే అన్నారు. వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడమేనని ఆయన దుయ్యబట్టారు. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, ఎక్కడ మహిళలు సుఖసంతోషాలతో ఉంటారో అక్కడ దేవతలు సంచరిస్తారని, ఆ ప్రాంతం సిరిసంపదలతో తులతూగుతుందని నిమ్మల పేర్కొన్నారు
Andhra Pradesh news
Ap Politics
minister nimmala Ramanaidu
Kommeneni arrest
Sakshi TV
మహిళలను కించపరచడం దారుణం
Scroll for the next article