Politics21st Dec 10:51 AMSunil Byrisetty1 min read
దుబాయ్ పర్యటనకు మంత్రి నిమ్మల
ప్రవాసాంధ్రుల ఆత్మీతయకు దుబాయి వేదికగా నిలిచింది. తెలుగు ఎన్నారైల ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు దుబాయిలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల ర
ప్రవాసాంధ్రుల ఆత్మీతయకు దుబాయి వేదికగా నిలిచింది. తెలుగు ఎన్నారైల ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు దుబాయిలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యులు టిడీ జనార్ధన్ పాల్గొన్నారు. దుబాయ్ చేరుకున్న వీరికి ఏపీ ఎన్నార్టీఎస్–ఎన్నారై డివిజన్, దుబాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.
మొదటి రోజు దుబాయ్ ‘ది ఫస్ట్ కలెక్షన్’ బిజినెస్ హోటల్‌లో నిర్వహించిన ‘గ్రీట్ అండ్ మీట్’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, టిడి జనార్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
రెండో రోజు ఆదివారం దుబాయ్ తెలుగు మైనార్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.