News17th Aug 12:39 PMSunil Byrisetty1 min read

మంత్రి నిమ్మల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు మంత్రి లోకేష్

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుక

మంత్రి నిమ్మల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు మంత్రి లోకేష్
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులు శ్రీజ, పవన్ లను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలకొల్లు చేరుకున్న మంత్రి నారా లోకేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరి రామాంజనేయ రాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Nimmala Ramanaidu
Nara Lokesh
Engagement Ceremony
West Godavari
Wedding Celebration
మంత్రి నిమ్మల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు మంత్రి లోకేష్
Scroll for the next article