News12th Aug 04:51 PMSunil Byrisetty1 min read

పుష్కర పనుల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం

పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారుల

పుష్కర పనుల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం
పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు వర్క్ షెడ్యూల్ అందజేశారని మంత్రి తెలిపారు. ఆ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అన్నదానిపై ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి మంత్రికి నివేదిక అందించారు. వర్క్ షెడ్యూల్ ఇచ్చి కూడా పనుల్లో వేగం పెంచకపోవడం ఏమిటని మంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పనుల్లో అలసత్వాన్ని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Irrigation Department
Pushkara Lift Scheme
Nimmala Ramasubba Reddy
Irrigation Projects
Pipeline Works
Project Delays
కాంట్రాక్టు ఏజెన్సీలు
ఇరిగేషన్ పనులు
ఏపీ ప్రభుత్వం
నీటి ప్రాజెక్టులు
Scroll for the next article