News18th Apr 09:50 AMSunil Byrisetty1 min read
ప్రత్యేక మేజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపు
రాష్ట్రంలోని ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ [క్లాస్-2] ల గౌరవ వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూ
రాష్ట్రంలోని ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ [క్లాస్-2] ల గౌరవ వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.
ఈ మేరకు గురువారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రత్యేక మెజిస్ట్రేట్లకు పెంచిన గౌరవ వేతనంకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ల గౌరవ వేతనాన్ని నెలకు రూ. 30000 నుంచి రూ. 45000 కు పెంచినట్లు అలాగే రవాణా ఖర్చుల నిమిత్తం మరో రూ. 5000 మొత్తాన్ని నెలకు చెల్లించనున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
ఇందులో ముఖ్యమైన విషయం గౌరవ వేతనం పెంపుదల2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తించేటట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.