News4th Sep 04:34 PMSunil Byrisetty1 min read
తురకపాలెంలోని మరణాల కారణాలపై సమగ్ర అధ్యయనం
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలోని మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సాధారణ సరళికి భిన్నంగా జూలై న
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలోని మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సాధారణ సరళికి భిన్నంగా జూలై నుంచి సెప్టెంబరు 3వ తేదీ మధ్య 23 మరణాలు జరిగినప్పుడు.. అప్రమత్తం కావడంలో వెనకబడకూడదన్నారు. సచివాలయంలో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డీఎంఈ డాక్టర్ రఘునందన్ లతో మంత్రి సమీక్ష జరిపారు. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల్యాబ్ నుంచి వచ్చే బాధితుల రక్త నమూనాల పరీక్షల ఫలితాలకు అనుగుణంగా త్వరలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని ప్రజలందరికీ కిడ్నీల పనితీరు పరీక్షలు, హెచ్బీఎ1సీ (షుగర్), బీపీ టెస్టులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
తురకపాలెం ఘటన నేపథ్యంలో సర్వైలెన్స్ వ్యవస్థలో తగిన మార్పులు చేయాలన్నారు. సమాచార సేకరణలో లోపం ఉండకూడదన్నారు. తురకపాలెంలో ఎక్కువగా నమోదైన మరణాలను ముందుగా గమనించి, విశ్లేషించడంలో జాప్యం జరిగిందని అధికారులు మంత్రికి వివరణ ఇచ్చారు.