News21st Mar 12:14 PMSunil Byrisetty1 min read

ఏపీలో ఇళ్ల పండుగ!

ఇళ్లు లేని పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేదరికమే అర్హతగా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఇళ్ల నిర్మాణంపై గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కొత్త అప్డేట్

ఏపీలో ఇళ్ల పండుగ!
ఇళ్లు లేని పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేదరికమే అర్హతగా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఇళ్ల నిర్మాణంపై గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కొత్త అప్డేట్ ఇచ్చారు. PMAY-2.0 కింద రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 53 వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని అన్నారు. లబ్ధిదారుల్లోని ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో కొత్త ఇళ్లు శరవేగంగా నిర్మాణం కానున్నాయి
Parthasarathi
AP Pmay Housing
Poor People
Ap welfare Schemes
ఇళ్ల స్థలాల
Scroll for the next article