Politics20th Sep 05:12 PMSunil Byrisetty1 min read

3,200 కోట్ల మద్యం స్కామ్ పై వైసీపీ సమాధానమేదీ?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం విధానం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే కాకుండా వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపి

3,200 కోట్ల మద్యం స్కామ్ పై వైసీపీ సమాధానమేదీ?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం విధానం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే కాకుండా వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వైసీపీ అధ్యక్షులు జగన్‌ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుని పాలన సాగించారని పార్థసారథి ఆరోపించారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సి ఉండగా, అధికారులను ఒత్తిడికి గురిచేసి తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో రూ. 3200 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, దానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Scroll for the next article