Politics7th Nov 04:23 PMSunil Byrisetty1 min read

క్రెడిట్ చోరీకి చేసిన మంచి ఏముంది జగన్?

గత ఐదేళ్లు నువ్వు చేసింది అంతా క్రెడిట్ చోరీనే, అంతా దోపిడినే, విధ్వంసమే కదా జగన్ అంటూ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహాం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫా

క్రెడిట్ చోరీకి చేసిన మంచి ఏముంది జగన్?
గత ఐదేళ్లు నువ్వు చేసింది అంతా క్రెడిట్ చోరీనే, అంతా దోపిడినే, విధ్వంసమే కదా జగన్ అంటూ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహాం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాను సమయంలో చంద్రబాబు ప్రభుత్వం సత్వర స్పందన చూపిందని, నష్ట అంచనా నుంచి కేంద్ర కమిటీని రప్పించడం వరకు పార్టీ-అధికార యంత్రాంగాలను సమన్వయం చేసి క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నడిపించిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. కేంద్ర మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర ఘార్గ్ కూడా చంద్రబాబును "విజన్‌కు మారుపేరు" అంటూ అభినందించారని, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడని నాయకుడని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ విధ్వంసాన్ని విజన్‌గా చూస్తే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, ఉద్యోగాలు, పెట్టుబడులతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల గురించి చర్చిస్తుంటే పులివెందుల ఎమ్మెల్యే మానసిక స్థితి దెబ్బతిని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో అభివృద్ధి జరిగిందని, క్రెడిట్‌ను చంద్రబాబు దోచుకుంటున్నారని చెప్పడం అమాయకత్వమా లేక నవ్వాలా అని ప్రశ్నించారు. 151 సీట్ల నుంచి 11కి పడిపోవడానికి మోసాలు, విధ్వంసమే కారణమని, ప్రజలు శిక్షించారని గుర్తుచేశారు.
Andhra Pradesh
Kolusu Parthasarathi
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
YSRCP
TDP
Coalition Government
రాజకీయాలు
అభివృద్ధి
పెట్టుబడులు
తుఫాన్ సహాయం
విజన్ నాయకత్వం
Scroll for the next article