News24th Oct 11:22 AMSunil Byrisetty1 min read
బెలుగుప్ప, శీర్పి చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీరందించాలి
బెలుగుప్ప, శీర్పి చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీరందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్
బెలుగుప్ప, శీర్పి చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీరందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఆదేశించారు. ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలం శీర్పి చెరువు మరియు బెలుగుప్ప చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి పంపింగ్ స్టేషన్ 9,10 ద్వారా చెరువులకు నీరు వెళ్లే కాలువను శీర్పి గ్రామం వద్ద అధికారులతో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ జీడిపల్లి రిజర్వాయర్ నుండి పంపింగ్ స్టేషన్ 9,10 ద్వారా బెలుగుప్ప, శీర్పి చెరువులకు నీరందించాలని, తమ ప్రభుత్వం అన్ని చెరువులకు నీరందించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ గుంతకల్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసనాయక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.