Politics23rd Jan 11:19 AMSunil Byrisetty1 min read

జగన్ భయం విజయసాయిరెడ్డే!

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విజయసాయిరెడ్డి హాజరైన విషయం తెలిసిందే. విచారణలో విజయసాయిరెడ్డి ఏయే నిజాలు చెప్పారో, ఎవరి పేర్లు బయటపెట్టారో అన్న ఆందోళనత

జగన్ భయం విజయసాయిరెడ్డే!
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విజయసాయిరెడ్డి హాజరైన విషయం తెలిసిందే. విచారణలో విజయసాయిరెడ్డి ఏయే నిజాలు చెప్పారో, ఎవరి పేర్లు బయటపెట్టారో అన్న ఆందోళనతో జగన్ ప్రశాంతత కోల్పోయారని మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. ఆ నెపాన్ని ప్రభుత్వంపైకి నెట్టేందుకే జగన్ కొత్త నాటకాలకు తెరలేపారని మండిపడ్డారు. “సొంత బాబాయిని చంపిన వారిని పక్కన పెట్టుకున్న జగన్‌కు విలువలు గురించి మాట్లాడే హక్కు లేదన్నారు పయ్యావుల. క్రెడిబిలిటీ లేని వ్యక్తి ‘క్రెడిట్ చోరీ’ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది” అని దుయ్యబట్టారు.భూములపై జగన్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తిప్పికొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకోవడానికి జగన్ ప్లాన్ చేశారని, కానీ కూటమి ప్రభుత్వం రీ-సర్వే ద్వారా ప్రజల భూములకు రక్షణ కల్పిస్తోందని స్పష్టం చేశారు. “ప్రజల పట్టా పుస్తకాలపై రూ.700 కోట్లు ఖర్చు చేసి నీ బొమ్మ వేసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు?” అని జగన్‌ను నిలదీశారు.
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
Vijay Sai Reddy
AP Liquor Scam
Enforcement Directorate
Minister Payyavula Keshav
Political Criticism
రాజకీయ విమర్శలు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
రీ-సర్వే
Scroll for the next article