News14th Apr 05:45 PMSunil Byrisetty1 min read

సెంట్రింగ్ కార్మికుడి అవతారమెత్తిన మంత్రి

అంబేద్కర్ స్ఫూర్తితో చింతపర్రు అరుంధతి పేటలో అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి రామానాయుడు శ్రమదానం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సో

సెంట్రింగ్ కార్మికుడి అవతారమెత్తిన మంత్రి
అంబేద్కర్ స్ఫూర్తితో చింతపర్రు అరుంధతి పేటలో అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి రామానాయుడు శ్రమదానం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. స్లాబ్ నిర్మాణ పనులను ఆ ప్రాంత ఎస్సీ నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. స్లాబ్ సెంట్రింగ్ పనుల్లో మంత్రి రామానాయుడు స్వయంగా పైకి ఎక్కి, చెక్కలు అమర్చి, మేకులు కొట్టే పని చేశారు. ఐరన్ కటింగ్ చేసి భుజంపై ఎత్తుకొని పనుల వద్దకు చేర్చారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా సెంట్రింగ్ కార్మికులతో పనిలో మమేకమయ్యారు . మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ళల్లో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిగా ఆర్య పేటలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహల స్లాబ్ నిర్మాణ పనుల్లో శ్రమదానం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ రోజే ఆయన నియోజకవర్గంలోని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలన్నింటికీ స్లాబులు వేసి నీడ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ జయంతి రోజున విగ్రహ స్లాబ్ పనుల్లో శ్రమదానం చేశారు.
Minister Ramanaidu
Ambedkar statue
Donation
Chintaparru Arundhati Peta
చింతపర్రు అరుంధతి పేట
మంత్రి రామానాయుడు
Scroll for the next article