News6th Dec 04:10 PMSunil Byrisetty1 min read
25వసారి రక్తదానం చేసిన మంత్రి రామానాయుడు
రాజ్యాంగ రూపకర్త, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తూ నా తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని మంత
రాజ్యాంగ రూపకర్త, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తూ నా తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని మంత్రి డా. నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో డా. బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో 107వ రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో యువకులతో కలిసి స్వయంగా మంత్రి రామానాయుడు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్, కూల్ డ్రింకులను మంత్రి అందజేశారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో దళిత వ్యక్తి జి.ఎం.సి బాలయోగి ని లోక్ సభ స్పీకర్ గా, ప్రతిభా భారతికి శాసన సభ స్పీకర్ గా అత్యున్నత పదవులు ఇచ్చింది చంద్రబాబుయే అన్నారు. అయితే మంత్రి రామానాయుడు 25వసారి రక్తదానం చేసి రికార్డు సృష్టించారు.