News6th Aug 04:59 PMSunil Byrisetty1 min read

రాయచోటి – మదనపల్లి మధ్య ట్రాఫిక్ ఐలాండ్

రాయచోటి – మదనపల్లి మధ్య ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో జాతీయ

రాయచోటి – మదనపల్లి మధ్య ట్రాఫిక్ ఐలాండ్
రాయచోటి – మదనపల్లి మధ్య ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ చైర్మన్ ఆర్.కె. సింగ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే సమావేశమయ్యారు. రాయచోటి, మదనపల్లి మధ్య రహదారిపై రహదారి ప్రమాదాల నివారణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా, రాయచోటి – మదనపల్లి మధ్య ప్రయాణం చేసే వాహనదారుల భద్రత దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రణాళికలో ఉన్న అండర్ పాస్ స్థానంలో ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాదాలను తగ్గించడంలో ట్రాఫిక్ ఐలాండ్‌లు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. అవసరమైన మార్పులు వెంటనే చేపట్టాలని సూచించారు. ఈ మేరకు తగిన ప్రణాళికను రూపొందించి త్వరితగతిన అమలు చేయాలనీ, ప్రజల ప్రయాణ భద్రతకు ఎలాంటి తడబాటు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు.
Andhra Pradesh news
Rayachoti
Madanapalle
Traffic Island
Road Safety
Mandipalli Ramprasad Reddy
National Highway Authority
RK Singh
మదనపల్లి
ట్రాఫిక్ ఐలాండ్
Scroll for the next article