Politics16th May 03:01 PMSunil Byrisetty1 min read
త్వరలోనే జైలుకు జగన్, పెద్దిరెడ్డి, రోజా!
వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా త్వరలోనే జైలుకు వెళ్తారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో భూములు దోచుకున్నారని విమర్శించారు. గతంలో చేస
వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా త్వరలోనే జైలుకు వెళ్తారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో భూములు దోచుకున్నారని విమర్శించారు.
గతంలో చేసిన తప్పులన్నీ ఇప్పుడు బయటికొస్తున్నాయని పేర్కొన్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు.
60 ఏళ్లు దాటిందని తప్పు చేసినా.. అవినీతి చేసినా వదిలేయాలా అనడిగారు.
రోజా డైలాగులు సినిమాల్లో పనికొస్తాయి కానీ.. రాజకీయాల్లో కాదని వ్యాఖ్యానించారు.