News21st Nov 02:30 PMSunil Byrisetty1 min read
యువజన మాసపత్రికను ఆవిష్కరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువతలో చైతన్యం, అవగాహన, మార్గదర్శకం పెంపొందించే ఉద్దేశంతో ప్రచురించబడిన యువజన మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భ
రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువతలో చైతన్యం, అవగాహన, మార్గదర్శకం పెంపొందించే ఉద్దేశంతో ప్రచురించబడిన యువజన మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆధునిక యుగంలో యువతను దారి తప్పించే ఎన్నో ప్రలోభాలు ఉన్న నేపథ్యంలో, వారికి సరైన దిశని చూపించే మాధ్యమాలు అత్యంత అవసరమని అన్నారు. ఈ మాసపత్రిక యువత వ్యక్తిత్వ వికాసం, విద్య, క్రీడలు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. చెడు అలవాట్లు, మాదకద్రవ్యాల వినియోగం, సామాజిక మీడియా దుర్వినియోగం వంటి ప్రమాదాలపై యువతలో స్పష్టమైన అవగాహన పెంచడంలో ఈ పత్రిక మేలుకొలుపుగా ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు. యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ఈ పత్రిక మార్గదర్శక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాసపత్రికను రూపొందించిన బృందాన్ని మంత్రి అభినందిస్తూ, యువత కోసం మంచి కార్యక్రమాలు, ఉపయోగకరమైన మార్గదర్శకాలు అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహకరంగా ఉంటుందని హామీ ఇచ్చారు.