Politics12th Jun 05:20 PMSunil Byrisetty1 min read
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఎన్ని
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్బంగా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మొదటి సంవత్సరం విజయోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి మంత్రి సవిత కేక్ కట్ చేశారు. ఆమె మాట్లాడుతూ, ఎన్నో ఆశలతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ లోని పథకాన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. వేద విద్యార్థులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద 67,27,164 మంది విద్యార్థులకు వర్తింపుచేస్తున్నామని, విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.8,745 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేయనున్నామని వెల్లడించారు.