News12th Jul 01:02 PMSunil Byrisetty1 min read
సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలంలోని బాగువలస గ్రామంలో నిర్వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిల్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు స
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలంలోని బాగువలస గ్రామంలో నిర్వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిల్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకి చెందిన 40 సైకిళ్లను, సుమారు రూ.3 లక్షల వ్యయంతో పంపిణీ చేయగా, నియోజకవర్గానికి ప్రత్యేకంగా 20 సైకిళ్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీకే యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్ధ చేపట్టింది. ప్రతి నెలా 80% దాటినా విద్యార్థికి రూ.1000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం, IIT, NITలు వంటి ప్రముఖ సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత విద్యా సహాయం అందించనున్నట్లు ఫౌండేషన్ ప్రకటించింది. సంధ్యారాణి మాట్లాడుతూ "వీకే యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ వంటి సంస్థలు పేద విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో మార్పును తీసుకురాగలవని విశ్వసిస్తున్నాను" అని తెలిపారు. సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.