Politics3rd Aug 06:17 PMSunil Byrisetty1 min read
“గొడ్డలి పార్టీ నవరత్నాలు”.. మహిళా మంత్రి సెటైర్!
నేరాలు చేసినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు నేరాలను ఖండించే బదులు సమర్థిస్తున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. మహిళలు
నేరాలు చేసినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు నేరాలను ఖండించే బదులు సమర్థిస్తున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. మహిళలు, దళితులపై దాడుల ఘటనల్లో వైసీపీ నాయకత్వం స్పందించలేదని విమర్శించారు.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎగతాళి చేసిన వారే, ఇప్పుడు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం, అందరికీ సంక్షేమమే లక్ష్యమని.. నేరాలకు పాల్పడిన వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. నవరత్నాలు అందిస్తామని చెప్పిన గొడ్డలి పార్టీ దాడులు, దౌర్జన్యాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.