Politics7th Mar 12:57 PMSunil Byrisetty1 min read

మంత్రి సంధ్యారాణికి అంగన్వాడిల సన్మానం

అంగన్వాడి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు అంగన్వాడి ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు గిరిజన సంక్షేమం, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్ర

మంత్రి సంధ్యారాణికి అంగన్వాడిల సన్మానం
అంగన్వాడి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు అంగన్వాడి ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు గిరిజన సంక్షేమం, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి సన్మానం చేశారు. అంగన్వాడి కార్యకర్తలకు రూ.1,00,000 అంగన్వాడి సహాయకులకు రూ.40,000 గ్రాట్యుటీ.. మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా మార్పు.. మట్టి ఖర్చులు.. ప్రతీ సెంటర్ లో త్రాగునీరు, మరుగుదొడ్లు మంజూరు.. 1వ తేదీనే జీతాలు.. సక్రమంగా సకాలంలో సరుకులు సరఫరా.. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పంపు.. వంటి ముఖ్యమైన హామీలను ప్రభుత్వం నెరవేర్చినందుకు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Minister Sandhya rani
Anganwadi
Andhra Pradesh
మంత్రి సంధ్యారాణి
అంగన్‌వాడీ
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article