News12th Nov 01:08 PMSunil Byrisetty1 min read

సాలూరులో గృహప్రవేశాల కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 3 లక్షల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా ఆటహాసంఘ కార్యకర్తల నడుమ సాలూరు మున్సిపాలిటీ 12వ వార్డులో గృహప్రవేశం, ఇల్లు శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి గుమ్మి

సాలూరులో గృహప్రవేశాల కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 3 లక్షల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా ఆటహాసంఘ కార్యకర్తల నడుమ సాలూరు మున్సిపాలిటీ 12వ వార్డులో గృహప్రవేశం, ఇల్లు శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. సాలూరు మున్సిపాలిటీలో మొత్తం 195 ఇళ్లకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 22,833 ఇళ్లు ఆమోదించగా, అందులో 15,661 ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు. పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీఎం-జన్‌మన్ పథకంలో 5,169 ఇళ్లు ఆమోదించగా 4,263 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. సాలూరు, పార్వతీపురం, పాలకొండ మున్సిపాలిటీలలో కొత్తగా 634 ఇళ్లకు ఆమోదం లభించినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.
Andhra Pradesh Government
Sandhyarani
Salur
Housewarming
Parvathipuram Manyam District
PM Janman Scheme
Housing
అభివృద్ధి కార్యక్రమాలు
మున్సిపాలిటీ
గిరిజన సంక్షేమం
Scroll for the next article