News13th Sep 04:06 PMSunil Byrisetty1 min read
తురకపాలెం మరణాలపై మంత్రి సమీక్ష
తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై సమగ్ర నివేదికను వారంలోగా అందజేయాలని ఉన్నతాధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. తురకపాలెంలో సీనియర్ వైద్యుల పర్యవేక్ష
తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై సమగ్ర నివేదికను వారంలోగా అందజేయాలని ఉన్నతాధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. తురకపాలెంలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతూనే ఉండాలని సూచించారు. తురకపాలెంలో నమోదైన వరుస మరణాల గురించి జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో విఫలం చెందారన్నారు.
ఎ.ఎన్.ఎం.లు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లే సమయంలో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటే ఆ సమాచారం జిల్లా అధికారుల ద్వారా రాష్ట్ర అధికారులకు వెంటనే అందే వ్యవస్థ (సర్వైలైన్స్) ను శాఖాపరంగా పటిష్టం చేయాలన్నారు.
తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలు, స్థానికుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, వాటి ఫలితాల గురించి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్, ఇతర అధికారులు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వివరించారు.