News11th Jul 10:14 AMSunil Byrisetty1 min read

పాదయాత్రలో మంత్రి సత్యకుమార్

ధర్మవరం పట్టణంలో మూడు రోజుల పాదయాత్రకు మంత్రి సత్య కుమార్ నేడు శ్రీకారం చుట్టారు. ప్రతి గుండెను తడుతూ, ప్రతి సమస్యను వింటూ ముందుకు సాగారు. పదవి కాదు... బాధ్యత గుర్తు చేసుకునేందుకే

పాదయాత్రలో మంత్రి సత్యకుమార్
ధర్మవరం పట్టణంలో మూడు రోజుల పాదయాత్రకు మంత్రి సత్య కుమార్ నేడు శ్రీకారం చుట్టారు. ప్రతి గుండెను తడుతూ, ప్రతి సమస్యను వింటూ ముందుకు సాగారు. పదవి కాదు... బాధ్యత గుర్తు చేసుకునేందుకే పాదయాత్ర అని పేర్కొన్నారు. ధర్మవరం తిక్కస్వామి నగర్‌లోని శివాలయం వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్ర పట్టణంలోని పలు వార్డుల్లో సాగింది. పాదయాత్ర చేస్తూ ప్రజలను కలిసి, అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. గతేడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు, రాబోయే ప్రణాళికలపై ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే పాదయాత్ర లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Andhra Pradesh news
Dharmavaram town
Minister Satya Kumar
padayatra
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కారానికి చర్యలు
Scroll for the next article