News10th Dec 11:36 AMSunil Byrisetty1 min read

11 నూతన ఔషధ పరిపాలనా భవనాలు ప్రారంభం

రాష్ట్రంలో రూ.11.12 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన 11 ఔషధ ప‌రిపాల‌నా భ‌వనాలు, టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. మంగళగిరిలోని వైద్య, ఆ

11 నూతన ఔషధ  పరిపాలనా భవనాలు  ప్రారంభం
రాష్ట్రంలో రూ.11.12 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన 11 ఔషధ ప‌రిపాల‌నా భ‌వనాలు, టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కార్యాలయాలను మంత్రి వర్చువల్ విధానంలో ఓపెన్ చేశారు. ప్రారంభమైన వాటిలో విశాఖపట్నం, శ్రీకాకుళం, అమలాపురం, నరసరావుపేట, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, కర్నూలులోని పరిపాలనా కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో విశాఖ, కర్నూలు కార్యాలయాలకు అనుబంధంగా కొత్త‌నా నిర్మించిన‌ ప్రాంతీయ ప్రయోగశాలలు కూడా ఉన్నాయి. 43,000 చదరపు అడుగుల్లో జరిగిన వీటి నిర్మాణాలకు రూ.11.12 కోట్ల వరకు వ్యయంచేశారు. ఇవి వినియోగంలోనికి రానున్నందున ఏడాదికి అద్దెల రూపంలో చెల్లించే రూ.15 లక్షల వరకు ప్ర‌భుత్వానికి ఆదా కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కలిపి వీటి నిర్మాణాలు పూర్తిచేసినట్లు చెప్పారు. ఉత్తరతీర ప్రాంతం, రాయలసీమలో ప్రాంతీయ ల్యాబులు అందుబాటులోనికి రావడంవల్ల సేకరించిన నమూనాల పరీక్షలకు రవాణ సమయం తగ్గడమే కాకుండా కల్తీ మందులు, కాలం చెల్లిన మందుల నిరోధానికి త్వరగా చెక్ పడుతుందని, అంతే కాకుండా నిఘా వ్య‌వ‌స్థ మ‌రింత పెరుగుతుంద‌న్నారు.
Andhra Pradesh
Drug Administration
Satya Kumar Yadav
New Buildings
Testing Labs
Healthcare Infrastructure
Visakhapatnam
Srikakulam
Amalapuram
తిరుపతి
చిత్తూరు
మదనపల్లె
కర్నూలు
ప్రజా ఆరోగ్యం
ప్రభుత్వ కార్యక్రమం
Scroll for the next article