News4th Aug 06:09 PMSunil Byrisetty1 min read

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ వైద్యం

రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులు దీటుగా ప్రభుత్వ వైద్య సేవలు పేదలకు అందించాలని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ వైద్యం
రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులు దీటుగా ప్రభుత్వ వైద్య సేవలు పేదలకు అందించాలని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక మ్మెల్యేతో కలిసి మంత్రి పాల్గొన్నారు. పాలసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్‌సిసిబి), ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో తమ సమగ్ర సీఎస్ఆర్ కార్యక్రమం ప్రాజెక్ట్ షైన్ కింద హెచ్‌సిసిబి కార్యక్రమాలలో భాగంగా వర్చువల్ విధానంలో మంత్రి చేతుల మీదుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చౌడేపల్లె, శాంతిపురం, తవణంపల్లె, పాలసముద్రం, బుగ్గ అగ్రహారం మరియు బైరెడ్డిపల్లె గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. పాలసముద్రం ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రి ఆవరణలో జరిగిన సమావేశంలో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలు ప్రారంభించారు.
Andhra Pradesh health minister
Satya Kumar Yadav
Palasamudram PHC
healthcare development
CSR project Shine
HCCB CSR
Hindustan Coca-Cola
Chittoor health camps
కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ వైద్యం
Scroll for the next article