Politics4th Jan 01:20 PMSunil Byrisetty1 min read
కుయ్.. కుయ్.. వైసీపీకి గూబ గుయ్!
వైసీపీ.. 108 వ్యవస్థను సరిగా నిర్వహించడం లేదంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది. దీనిపై 108 వ్యవస్థకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తన ట్వీటులో అసలు విషయాలు వె
వైసీపీ.. 108 వ్యవస్థను సరిగా నిర్వహించడం లేదంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది. దీనిపై 108 వ్యవస్థకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తన ట్వీటులో అసలు విషయాలు వెల్లడించారు. రణస్థలం ఘటనలో 108కు ఎప్పుడు కాల్ వచ్చింది... అంబులెన్స్ ఎప్పుడు వెళ్లిందనే విషయాన్ని ఆధారాలతో సహా వివరించారు. ఉదయం 08:05 గంటలకు కాల్ వస్తే.. 08:07 నిమిషాలకు అంబులెన్సుకు విషయం తెలియచేశారని... వెంటనే బయలుదేరిన అంబులెన్స్ ఘటనా స్థలానికి 08:14 చేరుకుందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం అంబులెన్సు పట్టణ ప్రాంతాల్లో 18 ని. లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 23 ని. లోపు సంఘటనా స్థలానికి చేరాల్సి ఉండగా, ఇక్కడ కేవలం 7 నిమిషాల్లో చేరిందని విషయాన్ని వెల్లడించారు. కడపలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టారు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి. కడపలోని రిమ్స్ ఆస్పత్రికి నేరుగా మీడియాను తీసుకెళ్లారు. ఆస్పత్రి ప్రాంగణంలో గత ప్రభుత్వ వైఖరి కారణంగా మూలనపడి.. ఎందుకూ పనికి రాకుండా ఉండిపోయిన 108 అంబులెన్సులను మీడియాకు చూపించారు.