Politics2nd Sep 11:54 AMSunil Byrisetty1 min read
మంత్రి సత్యకుమార్‌కు కీలక బాధ్యతలు
భాజపా జాతీయ నేత, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. 'సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాల దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా మంత్రి సత్యకుమార్ ను భాజ
భాజపా జాతీయ నేత, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.
'సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాల దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా మంత్రి సత్యకుమార్ ను భాజపా జాతీయ నాయకత్వం నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నది.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలు జరగనున్నాయి.
ప్రజాసేవ, దేశాభివృద్ధి, ‘వికసిత్ భారత్–2047’ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వివిధ కార్యక్రమాలకు సేవా సంకల్ప్ అభియాన్‌లో రూపకల్పన చేశారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా మంత్రి సత్యకుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.
‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘ఆంగన్ కా ఉత్సవ్’, ‘కహానీ బద్లావ్ కి’, ‘సేవా జ్యోతి యాత్ర’ వంటి పలు సేవా, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలతో నెల రోజుల పాటు అభియాన్ నిర్వహించనున్నారు.