News26th Oct 05:40 PMSunil Byrisetty1 min read
త్వరలో నెట్ వర్క్ ఆస్పత్రుల సమస్యలను పరిష్కరిస్తాం
త్వరలో నెట్ వర్క్ ఆస్పత్రుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.2700 కోట్ల బకాయిలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులు
త్వరలో నెట్ వర్క్ ఆస్పత్రుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.2700 కోట్ల బకాయిలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులు రూ.500 కోట్లు బకాయిలు చెల్లించాలని కోరాయి. రూ.250 కోట్ల బకాయిలు చెల్లిస్తామని చెప్పామని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా వైద్య సేవలు ఆగలేదన్నారు. దశల వారీగా అన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని వివరించారు. అలాగే మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని సత్యకుమార్ పేర్కొన్నారు.