News16th Jul 04:15 PMSunil Byrisetty1 min read

మానవత్వం చాటుకున్న మంత్రి సత్యకుమార్

వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. రోడ్ క్రాసింగ్‌లో యాక్సిడెంట్‌కు గురైన మ్యాథ్స్ లెక్చరర్ కె. పద్మావతిని తన స్వంత వాహనంలో ఎయిమ్స్ ఆసుపత్రికి పంపించార

మానవత్వం చాటుకున్న మంత్రి సత్యకుమార్
వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. రోడ్ క్రాసింగ్‌లో యాక్సిడెంట్‌కు గురైన మ్యాథ్స్ లెక్చరర్ కె. పద్మావతిని తన స్వంత వాహనంలో ఎయిమ్స్ ఆసుపత్రికి పంపించారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని ఎయిమ్స్ సూపరింటెండెంట్‌తో ఫోన్లో కోరారు. అటువైపుగా వెళ్తున్న మంత్రి కారు దిగి యాక్సిడెంట్ ఎలా జరిగిందని స్థానికులతో ఆరా తీశారు. మంగళగిరిలోని టిడిపి రాష్ట్ర కార్యాలయానికి సమీపంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. దీనిపై గుంటూరు యస్పీతో మాట్లాడిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అవసరమైన సహాయం అందించాలని కోరారు.
Andhra Pradesh news
Guntur
Health Minister Satyakumar Yadav
Maths lecturer K. Padmavati
accident
టిడిపి రాష్ట్ర కార్యాలయానికి సమీపంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది
Scroll for the next article