News17th Sep 04:50 PMSunil Byrisetty1 min read

మీరు ఫుల్లు... నాలెడ్జ్ ఉన్నోళ్లు కదా.. అసెంబ్లీకి రండి..

‘మీరంతా ఫుల్లు నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా... సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడమెందుకు...? అసెంబ్లీకి రండి... యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు ఏ అం

మీరు ఫుల్లు... నాలెడ్జ్ ఉన్నోళ్లు కదా.. అసెంబ్లీకి రండి..
‘మీరంతా ఫుల్లు నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా... సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడమెందుకు...? అసెంబ్లీకి రండి... యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు ఏ అంశంపైనైనా చర్చిద్దాం’ అని జగన్ సహా వైసీపీ నాయకులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఎద్దేవా చేస్తూ సవాల్ విసిరారు. తన ఫొటోను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ పొందిన 246 మంది బీసీ అభ్యర్థులు టీచర్ పోస్టులకు ఎంపిక కావడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. ‘మీరంతా ఫుల్ నాలెడ్జ్ కలిగిన వాళ్లు కదా... సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడం ఎందుకు..? అసెంబ్లీకి రండి... యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు సహా ఏ అంశంపైనైనా చర్చిద్దాం’ అని జగన్ సహా వైసీపీ నాయకులకు మంత్రి సవిత సవాల్ విసిరారు. కావాల్సినంత సమయం ఇస్తామని స్పష్టంచేశారు.
Andhra Pradesh
Assembly Sessions
Minister Savita
YSRCP
Jagan
Political Debate
BC Welfare
Cyber Crime
Social Media
Fake News
Urea
Onion Prices
Medical Colleges
Mega DSC
సోషల్ మీడియా మార్ఫింగ్
అబద్ధపు ప్రచారం
సైబర్ క్రైమ్ ఫిర్యాదు
Scroll for the next article