News19th May 03:46 PMSunil Byrisetty1 min read
"P4 స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్"కి శంకుస్థాపన
కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో "P4 స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్" నిర్మాణానికి జిల్లా ఇంచార్జి మంత్రి సవిత చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలిట
కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో "P4 స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్" నిర్మాణానికి జిల్లా ఇంచార్జి మంత్రి సవిత చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు & కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి , కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు.
ఈ కేంద్రం యువతకు ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనకు నూతన అవకాశాలు కల్పించనుంది.
పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఫ్రీలాన్సింగ్, చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు ఇది ప్రేరణగా నిలుస్తుంది.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని ఈ ప్రాజెక్టు లక్ష్యాలు, అమలు విధానాలపై వివరణ ఇచ్చారు.
P4 స్టార్టప్ కడప సెంటర్ కేవలం ఒక భవనం కాదు, ఇది యువతకు సృజనాత్మకతకు, ఆర్థిక స్వాతంత్ర్యానికి ప్రేరణ కలిగించే వేదిక అని పేర్కొన్నారు.