News19th Aug 05:24 PMSunil Byrisetty1 min read
చంద్రబాబు వల్ల మా కడుపు నిండుతోంది..
భోజనం చాలా బాగుంది... ఇంటి భోజనంలా రుచిగా ఉంది... అన్న క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేస్తున్నాం... చిన్న చిన్న షాపులో పనిచేస్తున్న మాలాంటి వాళ్లకు రూ.5 లకే భోజనం దొరుకుతుండడంతో
భోజనం చాలా బాగుంది... ఇంటి భోజనంలా రుచిగా ఉంది... అన్న క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేస్తున్నాం... చిన్న చిన్న షాపులో పనిచేస్తున్న మాలాంటి వాళ్లకు రూ.5 లకే భోజనం దొరుకుతుండడంతో డబ్బులు మిగులుతున్నాయి... చాలా ఆనందంగా ఉంది. పాలనలో సీఎం చంద్రబాబే నెంబర్ వన్... అని అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్న పేదలు, కార్మికులు కొనియాడుతున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వస్తూ మార్గంలోని విజయవాడలో ఉన్న అన్న క్యాంటీన్ ను సందర్శించారు. అక్కడ భోజనం చేస్తున్నవారితో ముచ్చటించారు. సామాన్యురాలిలా లైన్ లో నిల్చొని, రూ.5ల టోకెన్ తీసుకుని భోజనం చేశారు. వారు‘ఇంటి భోజనంలా రుచిగా ఉంది.. కూలి పనిచేసుకుంటున్న మాలాంటి వారికి అన్న క్యాంటీన్ వల్ల ఎంతో మేలు కలుగుతోంది.. రూ.5లకే కడుపు నింపుగా భోజనం చేస్తున్నాం. మా కష్టాన్ని తెలుసుకుని అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి లోకేశ్ కు ధన్యవాదాలని తెలిపారు.